Posts

ప్రయాణం

సమయం - ఆగస్ట్ 15, ఉదయం 5:00 గంటలు ప్రదేశం - చెన్నై ఇంటెర్నెషనల్ ఎయిర్ పోర్ట్ కార్లొ నుండి దిగగానే వడివడిగా పాస్ కౌంటర్ వైపు అడుగులు వేసాను . " సెక్యురిటి రీత్య ఈ రోజు విసిటర్స్ ని నిషేధించడమైనది " అని వ్రాసి ఉన్న బోర్డ్ చూసి నిరాశతో వెనేక్కి తిరిగాను . స్వాతంత్ర దినొత్సవం కావడం తొ సెక్యురిటి చాల టైట్ గా ఉంది . విసిటర్స్ ని కేవలం గేట్ వరకే అనుమతిస్తున్నారు . ఉండేది హైదరాబాద్ లొ అయినా , కావల్సిన వాళ్ళు అంతా చెన్నై లొ ఉండడంతో టికెట్ట్ అక్కడి నుండి బుక్ చేసాను . చెకిన్ ఇంకా చాల టైం ఉండడంతో నన్ను డ్రాప్ చెయ్యడానికి వచ్చిన అమ్మ , నాన్న , అక్కయ్య లతో మాటలు మొదలు పెట్టాను . ఇంతలో ఒక పదిహేను మంది లబలబమని వేన్ దిగారు . ఇంతకి అంత మంది వచ్చింది ఒక్కళ్ళని సాగనంపడానికి . అక్కడి దాక బాగనే కబుర్లు చెప్పుకుంటు వచ్చిన వాళ్లు గేట్ దగ్గరికి వచ్చి రావడంతొనే ఏడుపు మొదలుపెట్టారు . అసలే ఇంటెర్నేషనల్ టెర్మినల్ కావడంతో , విదేశియులు ఎక్కువ మంది ఉన్నారు, అందరు వాళ్ళ వైపే నోరు తెరుసుకోని మరి చుస్తూన్నారు...