ప్రయాణం

సమయం - ఆగస్ట్ 15, ఉదయం 5:00 గంటలు
ప్రదేశం - చెన్నై ఇంటెర్నెషనల్ ఎయిర్ పోర్ట్

కార్లొ నుండి దిగగానే వడివడిగా పాస్ కౌంటర్ వైపు అడుగులు వేసాను. "సెక్యురిటి రీత్య రోజు విసిటర్స్ ని నిషేధించడమైనది" అని వ్రాసి ఉన్న బోర్డ్ చూసి నిరాశతో వెనేక్కి తిరిగాను. స్వాతంత్ర దినొత్సవం కావడం తొ సెక్యురిటి చాల టైట్ గా ఉంది. విసిటర్స్ ని కేవలం గేట్ వరకే అనుమతిస్తున్నారు.

ఉండేది హైదరాబాద్ లొ అయినా, కావల్సిన వాళ్ళు అంతా చెన్నై లొ ఉండడంతో టికెట్ట్ అక్కడి నుండి బుక్ చేసాను.
చెకిన్ ఇంకా చాల టైం ఉండడంతో నన్ను డ్రాప్ చెయ్యడానికి వచ్చిన అమ్మ, నాన్న, అక్కయ్య లతో మాటలు మొదలు పెట్టాను. ఇంతలో ఒక పదిహేను మంది లబలబమని వేన్ దిగారు.ఇంతకి అంత మంది వచ్చింది ఒక్కళ్ళని సాగనంపడానికి. అక్కడి దాక బాగనే కబుర్లు చెప్పుకుంటు వచ్చిన వాళ్లు గేట్ దగ్గరికి వచ్చి రావడంతొనే ఏడుపు మొదలుపెట్టారు. అసలే ఇంటెర్నేషనల్ టెర్మినల్ కావడంతో, విదేశియులు ఎక్కువ మంది ఉన్నారు, అందరు వాళ్ళ వైపే నోరు తెరుసుకోని మరి చుస్తూన్నారు. వచ్చిన పదిహేను మంది కలిసి ఒక్క అమ్మయిని సేంటర్ చేసి మిగిలిన వాళ్ళు చుట్టూ నుంచుని ఒకటే ఏడుస్తున్నారు. ఖచ్చితంగా అమ్మయే పాసేంజర్ అని అప్పుడు నిర్ధారించుకున్నా. వాళ్ల భాధ చూసి అమ్మాయి కూడ నేను వెళ్ళను అని ఏడుస్తుంది.

"ఒక్కత్తె కూతురు అనుకుంటా, దూర ప్రాంతానికి పంపుతున్నారు కద మాత్రం భాద ఉంటుంది." అంది తతంగం అంతా చూస్తున్న మా అమ్మ. "సరే సరే,ఇప్పటికే ఒక్కలు కోసం పద్నాలుగు మంది భాద పడుతున్నారు మళ్ళి నువ్వు కూడా దిగులు పడాల్సిన పని లేదు." అని అన్నాను. ఇంతలో టైం అయ్యింది అని గుర్తు చేయ్యడానికి అన్నట్లు నా చేతి గడియరం ఆలారం మొగించింది. చివరి సారిగా అందరిని ఒక సారి చుసుకోని లగేజ్ తీసుకోని ముందుకు కదిలాను.

ఇంతలో నాన్న "ప్రతి రోజు టైంకి భోజనం చెయ్యి, చలి ప్రదేశం కాబట్టి ఐటెంస్ వేడిగా ఉన్నప్పుడే తినేసెయ్." అన్నాడు. "వెళ్ళగానే ఫొన్ చెయ్యి." అమ్మ అన్నది. సరే అన్నట్లు తల పంకించి ఏంట్రన్స్ వైపు కదిలాను.

ఇమ్మిగ్రేషన్ చేక్, బోర్డింగ్ పాస్ తీసుకునే పాటికి ఒక గంట పట్టింది. ఫ్లెట్ ఇంకా చాల సమయం ఉండడంతో వేయ్టింగ్ హల్ లోకి వెళ్ళాను, ఇంతలొ బయట చూసిన అమ్మయి వచ్చి నా పక్కనే కూర్చుంది. ఇంకా దిగులు గానే కనపడడంతో,సముదాయిద్దాం అన్నట్లు " ఏం చదువుతానికి వెళ్తున్నారు." అని తమిళం లో అడిగాను.
"కంప్యుటర్ ఇంజినీరింగ్ గ్రిన్విచ్ యునివర్సిటీ"
"గుడ్, మీది పెద్ద ఫ్యామిలి అనుకుంటా? అడిగాను నవ్వుతూ. ఆమె కూడా నవ్వి అవును అన్నట్లు తల వూపింది.

"ఫస్ట్ టైం అందరిని వదిలి దూరంగా వెళ్ళాలి అంటే కొంచెం దిగులు గానే ఉంటుంది. అక్కడికి వెళ్ళాక కొత్త ఫ్రెండ్స్, కొత్త పరిచయాలు నీకు అసలు టైమే తేలిదు తర్వాత అక్కడి నుండి రావాలి అనుకున్న రాలేవూ. కొన్ని రొజులు పోతే నీకే తెలుస్తుందిలే" అన్నాను.

"మీరు కుడా లండన్ కేనా?" అడిగింది.
"ఇప్పుడు అయితే లండన్ వరకే, కాని అక్కడి నుండి స్వీడెన్ వెళ్ళాలి."
"ఎన్ని సంవత్సరాలు నుండి స్వీడెన్ లొ ఉంటున్నారు మీరు."
అసలు ఉహించని ప్రశ్న అది. నేను కూడా మొదటి సారే అని చెబుతే ఇప్పటి వరకు నేను చెప్పిన సూక్తులు అని వృధా అవుతాయి. ఏదొ చేప్పబోతుంటే, ఇంతలొ విమానం బయలుదేరుతున్నట్లు అనౌన్స్ చేసారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని లగేజ్ తీసుకొని విమానం ఎక్కాను.

డొర్ దగ్గర ఒక ఎయిర్ హొస్టెస్ అందరిని నవ్వుతూ పలకరిస్తుంది. నన్ను చూడగానే ఇటు వైపు అన్నట్లు చెయ్యి ఎత్తింది. నేను నా చేతిలొని లగేజ్ కొసం అనుకొని నా బేగ్ ఇవ్వబొయాను. ఆమే నా వైపు ప్రస్నార్దకంగా చూస్తుంటే ఏదొ తేడా జరిగింది అని గ్రహించి సైలెంట్ గా వెళ్ళి నా సీట్ లొ కూర్చున్నాను. నా పక్క విండో సీటు ఒక పెద్ద ఆవిడది, చూడగానే పలకరింపుగా నవ్వాను. విండో లొ నుండి బయటకి చూస్తుంటే, నా ఆత్రుత గమనించింది కాబోలు,
" విండో పక్కన కుర్చుంటావా? " అని అడిగింది.
అవును అన్నట్లు తల ఊపి, " థాంక్స్ " అన్నాను.
కేప్టెన్ బయలుదెరుతున్నం అనటానికి గుర్తుగా సీట్ బెల్ట్ సిగ్నల్ ఆన్ చేసాడు. ఫ్లైట్ చాల ఎత్తులో ఎగురుతుంది. కాసేపు విండో లో నుండి బయటకి చూసి ఇంకా చూసేది లేక ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను.

ఇది మొదటి సారి ఇంటి నుండి బయటకి వెళ్ళడం. అది కూడా పక్క రాష్ట్రానికో, పక్క దేశానికో కాదు. ఏకంగా మరో ఖండానికి. అక్కడి పరిస్తితులు ఎలా ఉంటాయొ? నేను అసలే కర్మ సింధ్దాంతాల్ని బాగ నమ్మే మనిషిని. మనం చేసే ప్రతి పనిని అనుసరించే మన జివితం లొని కష్ట సుఖాలు ఆధారపడి ఉంటాయి అని నేను గట్టిగా నమ్ముతాను అని అనుకుంటుండగా. ఎవరొ పిలిచి నట్లు అనిపిస్తే నా ఆలొచనలకి బ్రేక్ వేసి అటు చూసాను. ఎయిర్ హొస్టెస్ వచ్చి లంచ్ ఆఫర్ చేసింది. నా పక్క వరసలొ ఉన్న ఒక తెల్ల అతను ఇచ్చిన పేక్ ఓపెన్ చేసి వెంటనే తల కొట్టుకోవడం మొదలు పెట్టాడు. ఎదన్న తీనే ముందు అలా చేయడం వాళ్ల ఆచారం అనుకొని తర్వత ఏం చేస్తాడా అని అలానే చూస్తున్న. వెంటనే కేబిన్ లోని స్టివార్డ్ ని పిలిచి ఏదొ చేప్పాడు. కొంత సేపు తర్వాత స్టివార్డ్ కొన్ని రొట్టే ముక్కలు, బటర్ తేచ్చి ఇచ్చాడు.

తెల్లొడే తినలేని వస్తువు ఏదొ అందులో ఉంది అంటే ఇంక నేను ఏలా తినగలను అనుకుంటు ఆత్రంగా బాక్స్ ఒపేన్ చేసాను. తమిళుల సాంప్రదాయ రితిలొ తయారు చేసిన పప్పు తొటకూర కలిపిన అన్నం వేడి వేడిగా పేక్ చేయబడి ఉంది అందులొ. కమ్మని పప్పన్నం వడ్డిస్తే అది నచ్చలేదురా నీకు అని అనుకుంటు తినడం కానిచ్చి, ఏం చేయ్యాలో తోచక లాప్ టాప్ ఒపెన్ చేసి మధుబాబు వ్రాసిన "రేడ్ ఎలెర్ట్" నవల చదవడం మొదలు పెట్టాను.
చదవడం పూర్తి చేసే సమయానికి ఒక గంట పట్టింది, నావిగేషన్ మాప్ విమానం లాండ్ అవ్వడానికి ఇంకా ఎనిమిది గంటలు సమయం ఉంది అని సూచించడంతో భారంగా నిట్టుర్చాను. విమానం ఎక్కేటప్పుడు ఎప్పుడు టేక్ ఆఫ్ అవ్వుతుందా అని ఆరాట పడిన నేను, ఎప్పుడు లాండ్ చేస్తాడా అని ఎదురు చూడడం బిగిన్ చేసాను. వీలు కుదిరితే దిగి వెళ్ళిపోదాం అని అనిపించింది. అలాగే ఆలోచిస్తు ఎప్పుడు నిద్ర లోకి జారుకున్నానో నాకే తేలియదు. ఇంకో అర్ద గంటలో లాండ్ అవుతాం అన్న కేప్టెన్ అనౌన్సెమెంట్ విని మెలుకువ వచ్చింది.

ఒక్కసారిగా ఏగిరి గంతు వెయ్యాలి అన్నంత సంతోషం నాకు అవరించింది. వెంటనే లగేజ్ తీసుకొని డోర్ దగ్గర రేడిగా ఉందాం అని అనిపించినా మళ్ళి బాగోదు అని బలవంతంగా ఆలొచనని అదిమేసాను. ఆల్టిట్యుడ్ తగ్గి నట్లే తగ్గి మల్లి పేరగడం మొదలు అయ్యింది. లాండ్ అవుతున్నాం అని చేప్పి మళ్ళి పైకి తీసుకు వెళ్తాడేంటి? కొంప తీసి హైజాక్ అయ్యిందా అని ఒక క్షణం అనిపించినా, అలా జరగదులే అని నాకు నేనె సమాధాన పరుచుకున్నాను.
"రన్వే బీజిగా ఉండటం వలన, గాల్లొనే ఇంకో రెండు రౌండ్లు వేద్దాం" అని నా పక్కన ఉన్న స్పికర్ ఖంగున మాట్లాడి సైలేంట్ అయిపోయింది. హొస్టెస్స్ ట్రాలి తొసుకుంటు వచ్చి, "ఎం కావాలి" అని స్టైల్ గా అడిగింది. ఒక పారాచ్యుట్ అడుగుదాం అనిపించి, ఆఖరి క్షణంలొ "కాఫీ" అన్నాను. ఇంకొ అరగంట కి లాండ్ అయ్యింది.

స్వీడెన్ విమానం ఇంక మూడు గంటలు వెయిటింగ్ అని తేలిసి ఇప్పుడు ఈ సమయం ఎలా గడపాల అని ఆలొచిస్తుండగా, నా పక్కనతను " నువ్వు అంత ఆలొచించాల్సిన పని లేదు, సెక్యురిటి చేక్కింగే రెండు గంటలు పడుతుంది" అన్నాడు. తీరా లగేజ్ తీసుకొని చెక్కింగ్ దగ్గరకి వెళ్లే పాటికి, ప్రతి కౌంటర్ దగ్గర ఉచిత ప్రసాదం పంచుతున్నట్లు పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయ్. అన్నిట్లొ కెళ్ళ చిన్న క్యూ చూసుకొని అందులొ నిలబడ్డాను. చిన్న పెద్ద , ఉన్నొడు లేనొడు , నల్లొడు తెల్లొడు అని భేధాలు లేకుండా అందరు క్యూ లో నెట్టుకొకుండా నిల్చోవడం చుసి నాకు బలే ముచ్చట వేసింది సుమీ.
"ఫీల్ అయ్యింది చాలు గాని ఇంక పద" అని నా అంతరాత్మ ముందుకు తొయ్యడంతొ మళ్ళి ఈ లొకంలోకి వచ్చాను. నుంచొని నుంచొని కాళ్ళు లాగుతున్నాయి గాని లైను మాత్రం కదలడంలేదు. అదే ఇండియా అయితే ఈ పాటికి ఎ టీ అమ్ముకునే వాడొ, పల్లిలు అమ్ముకునే వాడొ వచ్చేవాడు కొద్దిగ టైం పాస్ అయ్యేది.

మెల్లిగ ఒక గంట తర్వాత నా వంతు వచ్చింది. ఒంటి మీద బట్టలు తప్పించి నా వాచీ, కళ్ళజొడు, బెల్టు, షుస్ అన్ని లాక్కునారు. నిలువు దొపిడి చేసే వాడు కూడా అంత ఘోరంగా చేక్ చేయ్యడు. ఆ చేక్కింగ్ కారణంగా కలిగిన నీరసం వలన లండన్ ఎయిర్ పోర్ట్ చూద్దాం అనే ఆలొచన కూడా చచ్చిపొయింది. అర నిముషం లొ ఆరు విమానాలు దిగుతున్నాయి, ఆరు వెళుతున్నాయి. స్వీడెన్ ఫ్లైయ్ట్ ఫలాన టెర్మినల్ కి వచ్చింది అని అనౌన్సెమెంట్ విని, వెళ్ళి ఫ్లైయ్ట్ ఎక్కాను.

ఇప్పుడు ఎక్కింది ఎయిర్ బస్. అంటే ఇండియా నుండి లండన్ కి వచ్చిన బొయింగ్ విమానం లగ్జరి బస్ తో పోల్చుకుంటే ఇది ఆర్టిసీ బస్ లాంటిది అన్న మాట, కుదుపులు మాత్రం మాములే కాకపొతే ఎయిర్ లొ వెళుతుంది. టైం పాస్ కొసం కిటికీ లొ నుండి బయటకు చూస్తుంటే ఒక బిగుసుకుపొయిన రొట్టే ముక్క, పాలు లేని కాఫీ తీసుకొని వచ్చి నా ముందు పెట్టింది లేడి స్టివార్డ్. సిరియస్ గా ఒక చూపు చూసి రొట్టే పక్కన పడేసి, కాఫీ లోకి పాలు తీసుకొని రిక్వస్ట్ చేసాను. కాఫీ తాగడం పూర్తి అవ్వడం, ఫ్ల్యైట్ లాండింగ్ అవ్వడం రెండు వెంట వెంటనే జరిగిపొయాయి.

ఆర్లండా ఎయిర్ పోర్ట్ లో విమానం దిగే సమయానికి టైం రాత్రి ఎనిమిది అయ్యింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆకాశం లొ సూర్యుడు మాత్రం చంద్రుడిని బయటకి రానీయకుండా సాయంత్రం ఐదు గంటలకి ఎలా ప్రకాశిస్తాడో అలా ఉన్నాడు. లగేజ్ తీసుకొని విమానం దిగే సరికి ఎయిర్ పోర్ట్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది. నాతో పాటు విమానం దిగిన వాళ్ళు కూడా కనపడలేదు. కొంప తీసి అందరిని సాముహికంగా కిడ్నాప్ చేసారా ఏంటి అని అనుమానం కలిగింది. బయటకు దారి చూపించే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. అలాగే దారి వెతుక్కుంటూ బాగేజ్ బెల్ట్ దగ్గరికి వచ్చి లగేజ్ రిసీవ్ చేసుకొని, పక్కనే ఉన్న కౌంటర్ లొ ఎవరొ ఉన్నట్లు అనిపించి వెళ్ళి పలకరించాను. నన్ను చూడగానే ముఖం చేటంత చేసుకొని పాస్ పోర్ట్ ఇవ్వమని అడిగాడు. ఇదేంటి నాకు నేనుగా వెళ్లి పలకరిస్తే పాస్ పోర్ట్ ఇవ్వమని అడుగుతున్నాడు, లేక పొతే చేక్ చెయ్యరా? అసలు ఇవ్వాల వద్దా? ఇస్తే అటు నుండి అటే ఉడాయించడు కదా. అసలే చుట్టు పక్కల కూడా ఎవరు లేరు. సరేలే నా పాస్ పోర్ట్ ని అతను ఎం చేసుకుంటాడులే అని ధైర్యం చేసి పాస్ పోర్ట్ ఇచ్చాను.
"ఏ యునివర్సిటి?" అని అడిగాడు.
చెప్పాను.
"ఏ కోర్స్?" మళ్ళి అడిగాడు.
సమాధానం ఇవ్వగానే కాసేపు కంప్యుటర్ లొ ఎదొ చేక్ చేసి ఒక స్టాంప్ కొట్టాడు.
చివరగా "గుడ్ యునివర్సిటి, అల్ ది బేస్ట్" అని విష్ చేసాడు.
"థాంక్స్" అని చేప్పి, ఎయిర్ పోర్ట్ నుండి బయట పడ్డాను.
మనస్సు నిండా భవిష్యత్తు మీద బోలేడు ఆశలు, ఆశాయాలు తో అన్నిటికి మించి నా మీద నాకు ఉన్న కానిఫిడెన్సె తో స్టాక్ హొం నగరం లోకి అడుగు పెట్టాను.


Comments