పెళ్లి, పెళ్ళాం ఎందుకు?

అన్నట్లు జీవితంలో మనకి ఎవరో ఒకరు తోడు అవసరమా? ఇరవై ఐదు సంవత్సరాలు వయసు వచ్చే వరకు తల్లి-తండ్రులు, తర్వాత పెళ్ళాం తోడూ. అంటే కేవలం తోడు కోసం పెళ్ళా? ఇలా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు.

"వంటకని వైఫ్ ఎందుకురా హోటల్ చాలు"- అన్నాడు ఒక సినీకవి. అయన ఉద్దేశం ప్రకారం వైఫ్ కేవలం వంటచేయడానికేనా? ఔన్లే మరి మగవాడు బయటి పన్లు చూసుకున్నపుడు, భార్య ఇంటి పన్లు చూడాలి కద...

అసలు పెళ్లి చేసుకొని సుఖంగా జీవించే వాళ్ళు యెంత మంది? మనస్పర్ధలు రావడానికి కారణం ఏమిటి?
ఇలా అనుకుంటూ పొతే దీనికి అంతం ఉండదు. సమస్య గురించి ప్రఖ్యాత రచయిత జాన్ గ్రీ తన రచన "Men are from the Mars, Women are from the Venus" ( పుస్తకం కావాలి అంటే నాకు చెప్పండి) లో చాల తీక్షణంగావర్ణించాడు. ఆయన అందులో ఆడ-మగ మధ్య ఉండాల్సిన పరస్పర స్నేహం గురుంచి బహు చక్కగా వివరించాడు.

సృష్టి మొదలు ఐనప్పుడు మార్స్ గ్రహం మీద కేవలం మగవారు మాత్రమే ఉండే వారంట. మరి ఆడవారేమో వీనస్ గ్రహం మీద ఉండే వాళ్లు. ఒక సారి వీనస్ మీద ఉండే ఆడవాళ్ళూ, టెలిస్కోప్ సహాయంతో ఇతర గ్రహాలని పరిక్షిస్తుంటేవాళ్ళకి మార్స్ గ్రహం మీద మగవాళ్ళు కనపడ్డారు. తక్షణం వారు విమానంలో మార్స్ కి బయల్దేరారు. ఆడవాళ్ళూ మార్స్ మీదకి దిగిన మరు క్షణం అక్కడి మగవాళ్ళు వాళ్ళని చూసి ప్రేమ లో పడిపోయారు. వారు కూడా మగవాళ్ళ అందాన్ని చూసి వాళ్ల ప్రేమని ఒప్పుకున్నారు. ఇంక ఇద్దరు కలిసి భూమి మీద జీవనం మొదలు పెడదాం అని అనుకున్నారు. భూమి మీదకి వచ్చి ఆనందంగా జీవనం సాగించారు. కొన్నాళ్ళ తర్వాత ఇద్దరి మధ్య దూరం మొదలయింది. మనస్పర్దలూ మొదలయనై. మరి ఇద్దరు తమ ప్రొబ్లెంస్ ని ఎలా సరిదిద్దుకున్నారు? ఈ విషయాలు అన్ని కూడా ఆ పుస్తకంలో వివరించబడి ఉంది.

ఇవన్ని చూస్తుంటే కొందరకి ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలిదు. ఎవరతో ఎలా మెలగాలో తెలిదు.
ఒకరిని ఒకరు అర్ధం చేసుకొంటూ ఉంటే అసలు సమస్యలే రావు. మరి అర్ధం చేసుకోవడం ఎలా? ఈ ప్రశ్నకు ఒక్క సమాధానం అంటూ లేదు, పరిస్థితులకు అనుగుణంగా సమాధానం కూడా మారుతూ ఉంటుంది.

Comments

Ramani Rao said…
బాగుంది భరత్ గారు జ్ఞానోదయం చదువుతూ నేను ఏదో రాసాను చదవండి అంటు వ్యాఖ్యానించారు. మరి ఆ వ్యాఖ్య నాకా? సుజాత గారికో నాకర్ధం కాలేదు. మీరు మటుకు 'సుజాత గారు ' అంటూ సంభోదించారు. సరె కుడి ఎడమయితే పొరపాటు లేదులే అనుకొని నేనే చదివేసాను మరి. మీ అభిప్రాయాలు బాగున్నాయి. అక్కడి నా బ్లాగులో మీ వ్యాఖ్యకి ఇక్కడి మీ అభిప్రాయల వెల్లువకు నెనర్లు.
ramya said…
పెళ్ళి, పెళ్ళాం ఎందుకు?
మనిషి ఒంటరిగా జీవించలేడు, కష్టం కలిగినా సుఖాన్ని పంచుకోవాలన్నా తన వారు కావాలనుకుంటాడు..
ఇంకోవిషయం ఏమిటంటే ప్రతి వ్యక్తి కీ నిజానికి తన సంతానం కన్నా సొంత వ్యక్తి ఎవరూ ఉండరు ఆ పిల్లల్ని వ్యక్తులుగా తీర్చిదిద్ద డానికి తల్లీ తండ్రీ ఇద్దరి పాత్రా ఎంతో అవసరం... ఇవ్వన్నీ నా అభిప్రాయాలు మాత్రమే:)