మనకెందుకులే....!

ఆదివారం సాయంత్రం సోఫాలో కూర్చుని టీ తాగుతూ టైం పాస్ కోసం టీవీ ఆన్ చేశాను. ఒక ఛానల్లో వార్తలు వస్తునై.
హెడ్
లైన్స్ లో
"నడి
రోడ్ మీద పట్టపగలు హత్య!", అని చెప్పింది న్యూస్ రీడర్.

మిట్ట మధ్యానం అందరు చూస్తుండగానే గుర్తు తెలియని వ్యక్తులు నడి రోడ్ మీద హత్య చేసారు అని దాని సారాంశం.

"ప్రజలు అందరు చూస్తుండగానే అసలు హత్య ఎలా చేసారు ? వారికి యెంత దైర్యం. వాళ్ళని అడిగే వాళ్ళే లేరా?
అందరు కళ్ళకు గంతలు కట్టుకున్నారా. హత్య చేసిన వాళ్ళ తో పాటు అక్కడ గుడ్లు అప్పగించి చూస్తున్న జనాల్ని కూడాఉరి తియ్యాలి. ఎవరు కూడా అసలు బాద్యత లేకుండా వ్యవహరిస్తునారు.
నేను గనక అక్కడ ఉండుంటే వాళ్ళని పట్టుకుని చట్టానికి అప్పచేప్పేవాడిని....."

ఇంతలొ
ఎవరో నన్ను పట్టుకుని కుదిపిన్నట్టు అనిపించి నా ఆలోచనల నుండి బయటకి వచ్చి ఎవరా అని తల ఎత్తిచూసాను. ఎదురుగా అమ్మ నుంచుని ఉంది.

ఏమిటి
అన్నట్లు చూసాను.

"ఏంట్రా తీవ్రంగా ఏదో ఆలోచిస్తునావ్" అని అడిగింది.
నేను మౌనంగా చూస్తూ ఉండిపోయా.

" సరే నాకు ఎందుకుగాని! బాగా పొద్దుపోయింది గాని మార్కెట్ కి వెళ్లి కొన్ని కూరగాయలు పట్టుకురా." మళ్ళి అమ్మేచెప్పింది.

"సరే!" అని, బైక్ తీసుకోని బయల్దేరాను.
ఇంకా నా మనసులో అవే ఆలోచనలు.

ఆదివారం
కావటంతో రోడ్ మీద జనసంచారం బాగానే ఉంది. ఇంతలొ జన్నాల్లో నుండి ఏదో అలజడి.
ఏంటా అని బైక్ ఆపి అటు చూసాను.

ఒక
పెద్దావిడ " దొంగ దొంగ, పట్టుకోండి " అని అరుస్తుంది. ఆమె చేతిలోని పర్సు పట్టుకొని పారిపోతూ ఒకనడివయస్కుడు కనిపించాడు. దొంగని వెంటాడాలని బైక్ వెనక్కి తిప్పాను.

"ఆగు దొంగను పట్టుకుంటే నువ్వు కూడా పోలిసులు, కోర్టు చుట్టూ తిరగాలి !" అని నా అంతరాత్మ చెప్పడంతోమనకేందులే..." అని మార్కెట్ వేపు బైక్ పోనిచ్చాను.
ఆమె అరుపులు ఇంకా నాకు వినపడుతూనే ఉంది.

సారాంశం: ఏదైనా అనుకుంటే సరిపోదు, దానిని పాటించాలి. మన దాక వస్తే గాని అందులో కష్టాలు తెలియవు....

Comments

నిజమే మనం(?) అంతా మన్ను తిన్న పాములం. మనదాకా వస్తే కాని తెలీదు.
కానీ దొంగని పట్టుకొని సొమ్ము దొరికేలా చెయ్యడానికి పోలీసుల అవసరం లేదేమో.
Mitra said…
మనలొ ఎక్కువమందిఅలానె వున్నాము. గొర్రెలు. వీటిని కంట్రొల్ చెయుట కష్టం కాదు.అందుకెనెమొ దేశాన్ని విదేసీలు 1000 సంస్త్సరాలుగా పరిపాలిస్థున్నారు.
భరత్ said…
ప్రతాప్ గారు, శ్రిని గారు మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు.
MURALI said…
వ్యక్తిగత జీవితం గురించి బయపడి ఎవరు ధైర్యం చెయ్యరు. కానీ సమాజం, పోలిసులు ఖచ్చితంగా రక్షణ కల్పిస్తారు అనే నమ్మకం ఉంటే ఎవరన్నా ధైర్యంగా ముందడుగు వేస్తారు. దురదృష్టంకొద్దీ మనదేశంలో ఆ నమ్మకం లేదు.