చంద్రయ్య కాలువ లాకులెమ్మట, దిగువకి సుమారు మూడు కిలొమీటర్లు దూరం లో ఉంది మా ఊరు. మా ఊరు చేరుకొవాలంటె కాలి నడక ఒకటె మార్గం. కొంచెం కలిగిన ఆసాములైతె గుఱ్ఱం బగ్గిలనో, సైకిళ్ళనొ వాడేవారు.
ఏప్పుడొ నేను నాల్గవ తరగతి చదువుతున్నప్పుడు జరిగిన విషయం ఇది.మా వీధికి రెండు వీధుల అవతల ఉండేవాడు పాలు అమ్ముకొనే రాఘవులు.ఉదయాన్నె ఊరులో పాలు పట్టి వాటిని పట్నం లో అమ్మెవాడు. అటువంటి రాఘవులకి పక్కవాళ్ళ విషయాలు తెలుసుకొవడం అంటె మహా ఆసక్తి. ఎంత అంటె రెండు రోజులు భోజనం లేకపోయిన పర్వాలేదు కాని ఇతరుల గురించి ఆరాలు తియ్యకుండా మాత్రం అస్సలు ఉండేవాడు కాదు. అందుకే అందరు అతనిని ' ఆరాల ' రాఘవులు అని పిలిచేవారు. ఊళ్ళో ఏ విషయం జరిగిన అది ముందు రాఘవులకి తెలియాల్సిందె. ఎవరైన ఒక రోజు పాలు కొంచం ఎక్కువ పొయ్యమంటె, వాళ్ళకి ఎందుకు అవసరం వచ్చిందో కనుక్కొని మరి పొసేవాడు. ఊళ్ళోని ఏన్నొ ప్రేమ వ్యవహరలను బట్ట బయలు చేసిన ఘనత రాఘవులది.
రాఘవుల ఇంటి ఎదురుగానె ముత్యాలు ఇల్లు. మా ఊర్లో ఉన్న అందగత్తెలలొ ముత్యాలు కూడా ఒకటి. ముత్యాలుమేనమామ నాగరాజు అందరికి విరోధే, కారణం ముత్యాలెంక కన్నెతి చుసిన వాడి పని గొవిందే. ఇలానే ఒక సారిముత్యాల్ని ఏదొ అన్నారని టీ కొట్టు శ్రీను గాడికి, రెడ్డి గారి పాలెరు మల్లి గాడికి చేరో చెయ్యి తిసేసాడు. వైద్య పరిక్షకనివెళ్ళిన ముత్యాలు చెయ్యి నాడి చూడడానికి పట్టుకున్నాడని మా ఊరి ఆర్.ఎం.పి డాక్టర్ని కొట్టపొతే వాడూ ఊరు వదిలిపారిపోయాడు. ఊళ్ళోని కుర్రాళ్ళు అటు వైపుకు వెళ్ళడానికి కూడా భయపడేవారు.
ఒక రోజు రాఘవులకి సుస్తి చేసి బయటకి వెళ్ళలేదు. ఊళ్ళొ ఆరాలు ఎంటో తెలియకుండా పొయాయె అని తెగ దిగులుపడిపొయాడు. అదే ఆలొచనతొ ఆ రాత్రి నిద్ర కూడా పట్టలేదు. వరండాలొ పడుకున్నాడనే కాని అటు ఇటు దొర్లుతూనేఉన్నాడు. అప్పుడె వీధిలొ ఏదో అలికిడి వినపడడంతో ఏమై ఉంటుందా అని మంచం మీద నుండి లేచి చూట్టు చూసాడు. చీకట్లొ ఎవరో ముత్యాలు ఇంటి ముందు తచ్చట్లాడం చూసి ఎవరై ఉంటారా అని పెరట్లొ చెట్టు చాటున నక్కిగమనించసాగాడు. ఊళ్ళోని కుర్రాళ్ళంత తెలిసిన రాఘవులు ఆ వచ్చిన మనిషి ఎవరో చీకట్లొ పొల్చుకొలేక పొయాడు. ఇంతలొ అతను సైకిలు అక్కడే వదిలి, గొడెక్కి ముత్యాలు పెరట్లొకి దూకాడు. అసలే పొదట్నుంచి ఎటువంటి ఆరాదొరకలేదని దిగులుగా ఉన్న రాఘవులు ఉత్సాహంతో ఓపిక తెచ్చుకొని తన పెరట్లొ ఉన్న ములగచెట్టు ఎక్కడు. ముత్యాలు ఇంట్లొకి దూకిన మనిషి జాడ తెలియక పొవడంతో ఇంకొంచెం పైకి ఎక్కాడు, ఇంకెముంది అసలే ములగచెట్టు, దబ్బున క్రింద పడ్డాడు. నడుం విరిగింది.
డాక్టరు వచ్చి చూసి మూడు నెలల వరకు మంచం దిగకూడదన్నాడు. అర్ధరాత్రి చెట్టు ఎందుకు ఎక్కావు అని ఎందరుఎన్ని రకాలుగా అడిగిన నోరు మెదపలేదు. తనకి దెబ్బ తగిలిన నొప్పి కంటె ఆరాలకి దూరంగా ఉండాలి అన్న ఆలొచనఎక్కువగా బాధించసాగింది. అందరు వచ్చి రఘవులని పరామర్శించేవారు అదే విధంగా నాగరాజు కూడా కుశలంకన్నుక్కొవడానికి వచ్చాడు. నాగరాజుని చూసిన రాఘవులకి ప్రాణం లేచివచ్చినట్టు అయ్యింది. వెంటనే ఇన్ని రోజులుదాచుకున్న విషయం అతనికి చెప్పాడు. అది విన్న అతను కాసేపు ఆలోచించి, రాఘవులు చెవి దగ్గరికి వంగి, మెల్లిగాఅన్నాడు.
"సెకండ్ షో సినిమాకి వెళ్ళివచ్చి, గేటు తాళం వేసి ఉంటంతొ, అర్ధరాత్రి ఇంట్లొ వాళ్ళని లేపడం ఇష్టం లేక గోడ దూకి వెళ్ళిగొడ్ల సావిట్లొ పడుకున్నాను".
దాంతొ రాఘవులకి, మళ్ళి చెట్టు మీద నుండి పడినట్లు అనిపించింది.
సారంశం : మనకి అవసరం లేని విషయాలలో, వేలు పెట్టకూడదు.

Comments