అబద్ధం గురించి ఓ నిజం


అబద్ధం, పదం వినని వాళ్ళు, వాడని వాళ్ళు ఉండరు అంటే అతిశోయక్తి కాదేమో. నిజమే, ఎందుకంటె అది మన జీవితం లో ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది. గాలి పీల్చని వాడు ఉంటాడేమో గాని అబద్ధం ఆడని వాడు మాత్రం ఉండడు. "నేను అసలు అబద్ధాలు ఆడను" అని ఎవరైన అంటే, వాడు మన చెవిలో కాయలు పెట్టినట్లె. అలాగని ఏప్రిల్ 1 విడుదల సినిమా లో రాజేంద్ర ప్రసాద్ లానొ, సత్య హరిశ్చద్రుడు లానొ ఎక్కడ పడితే అక్కడ నిజాలు మట్లాడకూడదు. మరి ఎప్పుడు కూడా నిజాలే చెప్పాలా అంటే, దానికి కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి. అబద్ధం ఆడరాదు అని చెప్పిన పెద్దలే, వంద అబద్ధాలు ఆడి అయిన ఒక పెళ్ళి చెయ్యమన్నారు. ఇతరులకు ఇబ్బంది కలగనంతవరకు, వారి సంతోషం కొరకు అప్పుడపుడు అబద్ధాలు ఆడవచ్చు అని దాని అర్ధం.

క్లబ్ కెళ్ళి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన భర్త, భార్యతో ఆఫీస్ లో పని అని చెప్తాడు. ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేసి అమ్మతో ట్యుషన్కి వెళ్ళాను అని చెప్తాడు విద్యార్ధి. వేరే ఎవడితొనో ఎంజాయి చేస్తున్న ప్రియురాలికి, ప్రియుడు ఫోన్ చేస్తే క్లాసులోఉన్నాను తర్వాత మాట్లాడతా అని అంటుంది. అబద్ధాలు అన్ని తమ తప్పులని కప్పిపుచ్చడానికి చెప్పారే గాని, తమవారిని సంతోష పెట్టడానికి మాత్రం కాదు. కాని నిజం ఎంతో కాలం దాగదు అనేది జగమెరిగిన సత్యం.

ఆఫీస్ లో భర్త కష్టపడుతున్నాడు అనుకొనే భార్యకు, కొడుకు బుద్ధిగా చదువుకుంటునాడు అనుకొనే తల్లికి, తన ప్రియురాలిని అమితంగా ప్రేమించె ప్రియుడికి నిజం తెలిస్తే తర్వత ఏమవుతుందో తెలిసిందే. కావున ఒక అబద్ధం ఆడి అబద్ధాన్ని కప్పి పుచ్చడానికి మరి కొన్ని అబద్ధాలు చెప్పే బదులు, అసలు తప్పులు చెయ్యకుండా, అబద్ధాలు ఆడకుండాఉంటే అందరికి మంచిది. అబద్ధాలు వలన ఇతరులని మోసం చెయ్యొచ్చు గాని మన మనసును మోసం చెయ్యలేము.

నాకు ఒక లాయర్ స్నేహితుడు ఉన్నాడు. అతను ఎప్పుడు కూడా "అబద్ధం ఆడేవారు అంటే నాకు పరమ చిరాకు" అంటుడేవాడు. ఎలుక పిల్లకి ఏనుగు పిల్ల పుట్టింది అన్నా నమ్మవచ్చు గాని, అబద్ధం ఆడని లాయర్ (వృత్తిరిత్య) ఉంటాడా?? ఒక డాక్టర్ తన పేషంట్ కున్న జబ్బుని దాచేసి, పేషంట్ ఆరొగ్యం కొసం " నీకు జబ్బు లేదు, మందులువాడు తగ్గిపొద్ది" అని అబద్ధం చెప్పవచ్చు, తప్పు లేదు.

ఒక మతభోదకుడు ప్రసంగిస్తు,
" రేపటి అంశంగా అబద్ధం వలన కలుగు పాపం గురించి మాట్లాడుకుందాం" అని అన్నాడు.
" దానికి ముందుగా అందరు కూడా భగవద్గిత లొని నాల్గవ అద్యాయం నుండి 43వ వచనం చదువుకుని రండి".
తర్వాత రోజు ప్రసంగం ప్రారంభిచక ముందు అందరి వంక ఒకసారి చూసి, "ఎంత మంది మీలొ నేను చెప్పిన వచనం చదువుకొని వచ్చారొ చేతులు ఎత్తండి" అన్నాడు.
సభికుల్లొ నుండి చాల మంది చేతులు ఎత్తారు.
భోదకుడు చిన్నగా నవ్వి, "అబద్ధం వలన కలుగు పాపం అనేది, మనం తప్పకుండా చర్చించుకోవాలి, ఎందుకంటే 4వ అధ్యయం లో 42 వచనాలు మత్రమే ఉన్నయీ"

ఈ విదంగా
అవసరం ఉన్న లేక పొయినా అబద్ధాలు చెప్పడం అందరికి అలవాటు అయిపొయింది.కావున నిజం మట్లాడం అలవర్చుకుంటే, జీవితం లోని మార్పును మీరే గమనించవచ్చు. జీవితం లో అబద్ధాలు ఆడవచ్చు కాని, అబద్ధాలే జీవితం కాకుడదు. ఇప్పుడు "అబద్ధం" గురించి నేను చెప్పింది అంతా అబద్ధం అనుకునేరు, పచ్చి నిజమండి బాబు...

Comments

Anonymous said…
really nice and thoughtful.